ఫ్లిప్‌కార్ట్‌లో ప్రెషర్ కుక్కర్‌ కొన్నారా? అయితే ఈ సంగతి తెలుసుకోండి!

17 Aug, 2022 15:34 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ, సీసీపీఏ  జరిమానా 

సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మేండేటరీ స్టాండర్స్‌ పాటించకుండా నిబంధనలనుఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ. 1 లక్ష జరిమానా విధించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన  ఆదేశాల ప్రకారం, 45 రోజుల్లో సమ్మతి నివేదికను సమర్పించడంతో పాటు, ఆయా ఉత్పత్తులను రీకాల్ చేసి, వారి చెల్లింపులను రీయింబర్స్ చేస్తామని వినియోగదారులకు తెలియ జేయాలని సీసీపీఏని ఆదేశించింది. 

లోపాలున్న ప్రెషర్ కుక్కర్ల విక్రయాలను విక్రమించినట్టు సీసీపీఏతేల్చింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని మొత్తం 598 ప్రెషర్ కుక్కర్లు విక్రయం ద్వారా ఇ-కామర్స్ మొత్తం రూ. 1,84,263 వసూలు చేసిందని పేర్కొంది. ఇటీవల (ఆగస్టు 4న) లోపభూయిష్టమైన ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించినందుకు లక్ష రూపాయల పెనాల్టీ చెల్లించాలని ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ను ఆదేశించింది.  ఇలా అమెజాన్‌   మొత్తం 2,265 ప్రెషర్ కుక్కర్లు అమ్మిందని సీసీపీఏ   పేర్కొన్న  సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు