రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్‌!

3 Nov, 2023 19:50 IST|Sakshi

రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఝలక్‌ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ప్రైవేట్ రంగ  ఫెడరల్ బ్యాంక్‌తో పాటు మరో రెండు ఫైనాన్స్‌ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది.

వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్‌ సర్వీస్‌ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్‌కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు