మారనున్న నిబంధనలు!, పాన్‌ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం?

5 Dec, 2022 19:45 IST|Sakshi

వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో (nsws) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వ్యాపారాల అనుమతుల విషయంలో ఈ ఎన్‌ఎస్‌డ్ల్యూఎస్‌ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.   

వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలో బిజినెస్‌ ప్రారంభించాలనుకునేవారు కొన్ని సార్లు  కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి వేర్వేరు ఆమోదాలు, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం  ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ,జీఎస్‌టీఎన్‌,టీఐఎన్‌,టీఏఎన్‌, పాన్‌ వంటి 13 విభిన్న ఐడీల్ని ఉపయోగించాల్సి ఉంది. 

అయితే పైన పేర్కొన్న ఐడీ కార్డలను ఉపయోగించి అప్రూవల్‌ పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఆ సమస్యను అధిగమించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్క పాన్‌ కార్డుతో  అనుమతులు ఇచ్చేలా నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టం పద్దతిని అమలు చేస్తే ఎలా ఉంటుందో’నని కేంద్రం పరిశీలిస్తోంది. 

ఈ విషయంపై తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెవెన్యూ శాఖను సంప్రదించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘మేము ఇప్పటికే ఉన్న డేటాబేస్‌లలో పాన్‌ నెంబర్‌ను ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. కాబట్టి పాన్‌తో, కంపెనీకి సంబంధించిన ప్రాథమిక డేటా, దాని డైరెక్టర్లు, చిరునామాలు, సాధారణ డేటా ఇప్పటికే పాన్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి’ అని గోయల్ అన్నారు. ప్రస్తుతం పాన్‌ కార్డును వినియోగించి వ్యాపారా అనుమతులు ఇచ్చేలా సింగిల్‌ విండో పాలసీని కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.   

చదవండి👉 మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు

మరిన్ని వార్తలు