ఇ గోపాలా.. డెయిరీలకు తోడు నీడ

30 Aug, 2021 10:34 IST|Sakshi

పాల ఉత్పత్తిలో నిరంతరం శ్రమిస్తున్న వారికి అండగా ఉండేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీడీసీ) ఇ గోపాలా వెబ్‌పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమికి రెండు రోజుల ముందు ఈ వెబ్‌పోర్టల్‌ని కేంద్ర మంత్రి రూపాల ప్రారంభించారు. ప్రధాని మోదీ నిర్ధేశించిన డిజిటల్‌ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ వెబ్‌పోర్టల్‌ని రూపొందించినట్టు తెలిపారు.


డెయిరీలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెటింగ్‌ విధానాలు, నూతన యాజమాన్య పద్దతులు ఎప్పటికప్పుడు డెయిరీ రంగంలో ఉన్నవారికి తెలియ జేసేందుకు ఇ గోపాలా పేరుతో ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. 


ఇ గోపాల అప్లికేషన్‌ ద్వారా డెయిరీకి సంబంధించి సమాచారంతో పాటు లైవ్‌ స్టాక్‌ కొనుగోలు అమ్మకాలు, బ్రీడింగ్‌ , రోగనిర్థారణ, నివారణ పద్దతులకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.
 

చదవండి: PMJDY: పీఎంజేడీవై ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్

మరిన్ని వార్తలు