ఐసీఐసీఐలో చైనా భారీ పెట్టుబడులు

19 Aug, 2020 12:54 IST|Sakshi

సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో చైనా బ్యాన్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (సెంట్రల్ బ్యాంకు) ఐసీఐసీఐ బ్యాంకులో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో పెట్టుబడులతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన తరువాత చైనా సెంట్రల్ బ్యాంక్  తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును ఎంచుకుంది.

కాగా ఐసీఐసీఐ బ్యాంకులో సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ లాంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి ప్రస్తుతం, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ భారతదేశంలో చైనా పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. సరిహద్దులో చైనా దుశ్యర్య తరువాత  చైనాకు చెందిన టిక్‌టాక్, షేర్‌ఇట్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే  చైనా పెట్టుబడులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
 

మరిన్ని వార్తలు