టెక్‌ దిగ్గజాలపై చైనా ఆగ్రహం

21 Nov, 2021 05:12 IST|Sakshi

China Fines Tech Giants Over Anti-Monopoly Violations:  దేశీయ బడా వ్యాపార సంస్థలు తమ కనుసన్నల్లోనే పనిచేయాలనే ఆధిపత్య వైఖరిని చైనా మరోసారి బయటపెట్టుకుంది. ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల విషయాలను ముందస్తుగా తెలియజేయలేదనే సాకుతో చైనా అక్కడి దిగ్గజ టెక్‌ సంస్థలపై జరిమానాలను విధించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని, గత ఏనిమిదేళ్లలో జరిగిన 43 సంస్థల కొనుగోళ్ల లావాదేవీల వివరాలను ప్రభుత్వానికి నివేదించని కారణంగా ఈ జరిమానాలు విధిస్తున్నట్లు మార్కెట్‌ నియంత్రణ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. సంస్థల ఒక్కో ఉల్లంఘనకు రూ.60లక్షల చొప్పున జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు