తల్లి అకౌంట్‌నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్‌ గుండె గుభిల్లు!

9 Jun, 2023 16:12 IST|Sakshi

న్యూఢిల్లీ:మారాం చేస్తున్న పిల్లలకు అన్నం తినిపించాలన్నా, అల్లరి చేసినా, ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసు కోవాలన్నా తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న మంత్రం దండం స్మార్ట్‌ఫోన్‌.  ఇది ప్రస్తుత కాలంలో పిల్లలకు అడిక్షన్‌లా మారిపోయింది. ఇది ప్రమాదకర ధోరణి అని, పిల్లలకు, మైనర్లకు స్మార్ట్‌ఫోన్‌ దూరంగా ఉంచాలని నిపుణులు పదేపదే హెచ్చిరిచ్చుస్తున్నారు. తాజాగా పేరెంట్స్‌  గుండెలు గుభిల్లుమనే స్టోరీ ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా  లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇటీవల బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)  ఇండియాలో మళ్లీ షురూ అయిన నేపథ్యలో ఈ షాకింగ్‌ న్యూస​ మరింత ఆందోళన  రేపుతోంది

ఇన్‌సైడర్ ప్రకారం చైనాకు చెందిన టీనేజ్‌ బాలిక (13)  మొబైల్‌ గేమ్స్‌ కారణంగా తల్లి ఖాతాలోని  మొత్తం సొమ్మును ఖతం చేసేసింది.  అయితే స్కూలు నుంచి ఫోన్‌ వచ్చేవరకు బాలిక ఈ కుటుంబం ఈ విషయాన్ని పసిగట్టలేదు. స్కూల్‌లో ఎక్కువసేపు ఫోన్‌లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది.  పే టూ ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్‌ అయిందని గుర్తించిన టీచ‌ర్ బాలిక త‌ల్లిని అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది. వెంటనే  బాలిక త‌ల్లి యివాంగ్‌కు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవ‌లం రూ. 5( 0.5 యువాన్ )మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. (రిటర్న్ టు ఆఫీస్ గూగుల్‌ వార్నింగ్‌: ఉద్యోగులేమంటున్నారంటే!)

నాలుగు నెల‌ల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు త‌గ‌లేసింది. అంతకాదు త‌న క్లాస్‌మేట్స్ గేమ్స్‌కు కూడా ఈమే చెల్లింపులు చేసింది ఇంటిలో డెబిట్ కార్డు క‌నిపించ‌డంతో దాన్ని త‌న స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాన‌ని, దాని పాస్‌వ‌ర్డ్‌ను త‌ల్లి త‌న‌కు చెప్పింద‌ని బాలిక  చెప్పింది.  ఇంకో షాకింగ్‌ విషయం ఏమిటంటే త‌ల్లికి అనుమానం రాకుండా త‌న స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీల‌కు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు  అన్నింటినీ  డిలీట్‌ చేసింది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్‌ మహీంద్ర)

అయితే తన  సహవిద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్లు ఒప్పుకుంది. వాళ్లు కూడా గేమ్‌ ఆడేందుకు డబ్బు డిమాండ్ చేశారనీ, వారికి పంపకపోతే, ఇబ్బంది పెట్టేవారని సదరు బాలిక వెల్లడించింది. అలాగే టీచర్‌కి చెబితే టీచర్ తన పేరెంట్స్‌కికి చెబితే,  వారికి కోపం వస్తుందేనని  భయపడినట్టు చెప్పుకొచ్చింది.

కాగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్‌ యాప్స్‌ వైపు ఆకర్షితులవుతున్న యూత్‌ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనాతో సహా అనేక దేశాలు గేమింగ్ వ్యసనంనుంచి మైనర్లను  కాపాడే చర్యలను చేపడుతున్నాయి.

మరిన్ని వార్తలు