CMIE: నవంబర్‌లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!

2 Dec, 2022 06:23 IST|Sakshi

ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి  పైగా పెరిగింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది.  అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్‌లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్‌ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్‌ (23.9 శాతం) బీహార్‌ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్‌గఢ్‌ (0.1 శాతం), ఉత్తరాఖండ్‌ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు