-

పెట్రోలుకు తోడు మరో షాక్ 

2 Mar, 2021 08:21 IST|Sakshi

సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు భారీ పెంపు

ప్రస్తుతానికి ఢిల్లీ,  ఎన్‌సీఆర్‌ పరిధిలో

క్రమంగా అన్ని  నగరాల్లోనూ అమలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడి బతుకు మరింత భారం కానుంది. ఇప్పటికే డీజిల్‌,పెట్రోలు ధరలు ఆకాశాన్నంటాయి. అటువంట గ్యాస్‌ సిలిండర్‌  ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)  గృహావసరాల కోసం వినియోగించే  పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను కూడా ఐజీఎల్‌  (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ)  భారీగా  పెంచేసింది. వంటగ్యాస్ సిలిండర్ల ధరను  పెంచిన  24 గంటల్లోనే  సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సవరిస్తూ ఐజీఎల్‌ నిర్ణయం తీసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి  సవరించిన రేట్లుఅమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ)

సీఎన్‌జీ ధరను 70 పైసల మేర, 91 పైసల మేర పీఎన్‌జీ రేట్లను పెంచినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. కొత్తగా సవరించిన రేట్ల ప్రకారంఢిల్లీలో సీఎన్జీ రేటు 43.40కి పెరిగింది. పీఎన్జీ ధర 28.41కు చేరింది. ప్రస్తుతానికి దేశ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, ఫతేపూర్, హమీర్‌పూర్, ముజ్జఫర్ నగర్, షామ్లీ, కర్నాల్, కైతాల్,  రేవారిలో ఈ ధరల పెంపు  అమల్లోకి వస్తుందని ఐజీఎల్ ప్రకటనలో తెలిపింది. అయితే దశలవారీగా అన్ని నగరాల్లోనూ పెంచిన  రేట్లు అమలు చేయనున్నాయి.   (పెట్రో సెగలపై ఆర్‌బీఐ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు