కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్‌ ధర.. ఎంతంటే?

1 Jan, 2023 08:55 IST|Sakshi

న్యూ ఇయర్‌ తొలిరోజే గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌ తగిలింది. ఆయిల్‌ కంపెనీలు 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఇక పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్‌,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. 

దేశంలో స్థిరంగా డొమెస్టిక్‌ గ‍్యాస్‌ ధరలు 
దేశంలో డొమెస్టిక్‌ గ‍్యాస్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు