Nawaz Modi Viral Videos: గేటుకు తాళం వేసి దివాలీ పార్టీకి రానీయ లేదు: బిలియనీర్‌ భార్య వైరల్‌ వీడియో

13 Nov, 2023 21:22 IST|Sakshi

రేమండ్  సీఎండీ  గౌతమ్ సింఘానియా తన భార్య  నవాజ్‌  మోడీతో విడిపోయినట్లు ప్రకటించడం బిజినెస్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే 53 ఏళ్ల ఫిట్‌నెస్ కోచ్ నవాజ్‌మోడీ  ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.  ఇటీవల  భర్త గౌతమ్‌ సింఘానియా నిర్వహించిన దీపావళి పార్టీకి హాజరయ్యేందుకు తనను అనుమతించలేదని  చెబుతున్న వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో భర్త నుంచి తనకు  ఆహ్వానం ఉన్నప్పటికీ  దీపావళి పార్టీకి రాకుండా ఒక 'బలవంతుడు' తనను గేటు వద్ద అడ్డుకున్నాడని గౌతమ్ సింఘానియా భార్య ఆరోపించారు. గత వారం తన భర్త  నిర్వహించిన దీపావళి పార్టీకి  హాజరవకుండా ఆపారనీ, దాదాపు  మూడు గంటలకు పైగా లోపలికి వెళ్లకుండా  గేటు వెలుపల వేచి ఉండేలా చేశారని ఆరోపించారు.  ఇది ఇలా ఉండగా  గత నెలలో, నవాజ్ మోడీపై  గౌతమ్‌  బ్రీచ్ క్యాండీ ఇంట్లో దాడి చేయడంతో కాలర్ బోన్ విరిగిపోయిందనీ, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని, దీనిపై ఎలాంటి కేసు నమోదు  కాలేదని   ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం తెలుస్తోంది.

కాగా గతంలో కన్నతండ్రి విజయ్ సింఘానియా  గౌతమ్‌ సింఘానియాపై ఆరోపణలు చేశారు. తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా  బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. అయితే తన తండ్రి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని  గౌతమ్ సింఘానియా కొట్టి పారేశాడు.  తన తండ్రి ఆస్తులకు కేవలం తాను మాత్రమే చట్టపరమైన వారసుడినని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యను కుటుంబసభ్యులు సామరస్యంగా,స్నేహాపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అంతేకాదు విజయపత్ సింఘానియాను  చైర్‌పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి  రేమండ్ లిమిటెడ్ షాకింగ్ తొలగించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఆస్తి వివాదం మధ్య దక్షిణ ముంబైలోని గ్రాండ్ పార్డి సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.  (విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్‌ షాకింగ్‌ ప్రకటన)

మరిన్ని వార్తలు