క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...

9 Mar, 2023 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్‌ అసెట్స్‌ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్‌ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇండియా (ఎఫ్‌ఐయూ–ఐఎన్‌డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్‌ చేసిన కోడ్‌ లేదా నంబరు లేదా టోకెన్‌లను వర్చువల్‌ డిజిటల్‌ అసెట్లుగా పరిగణిస్తారు. 

(ఇదీ చదవండి: ఫోరెన్సిక్‌ ఆడిటర్లకు గడువు పెంపు)

మరిన్ని వార్తలు