ఎకానమీకి ‘కరెంట్‌ అకౌంట్‌’ అనిశ్చితి

29 Sep, 2023 05:52 IST|Sakshi

అంతర్జాతీయ ఎకానమీ, ఎగుమతుల బలహీనతల నేపథ్యం  

న్యూఢిల్లీ: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్‌ కరెంట్‌ అకౌంట్‌.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి అద్దం పడుతోంది. త్రైమాసికాల పరంగా చూస్తే, 2023 జనవరి– మార్చి మధ్య 0.2 శాతం ఉన్న కరెంట్‌ అకౌంట్‌ లోటు– క్యాడ్‌ (జీడీపీ విలువలో) తదుపరి త్రైమాసిక కాలంలో (2023 ఏప్రిల్‌–జూన్‌) మధ్య 1.1 శాతానికి పెరిగింది.

విలువల్లో చూస్తే ఈ పరిమాణం 1.3 బిలియన్‌ డాలర్ల నుంచి 9.2 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. ఎగుమతులకన్నా దిగుమతులు భారీగా పెరగడం (వాణిజ్యలోటు) దీనికి కారణం. ఇక వార్షికంగా చూస్తే మాత్రం 2022 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 2.1 శాతంగా ఉన్న క్యాడ్‌ తాజా సమీక్షా క్వార్టర్‌లో (2023 ఏప్రిల్‌–జూన్‌) 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. విలువల్లో సైతం 17.9 బిలియన్‌ డాలర్ల నుంచి 9.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. వార్షికంగా (పోలి్చ) చూస్తే, అంతర్జాతీయంగా ఎకానమీ మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది.

త్రైమాసికంగా బలహీనతలు...
ఇటీవలి నెలల్లో భారత్‌ వస్తు ఎగుమతులు క్షీణతలో కొనసాగుతున్నాయి. సేవల రంగానిదీ ఇదే ధోరణి. కంప్యూటర్‌ ఎగుమతుల్లో క్షీణత కనబడుతోంది. పర్యాటకం, వ్యాపార సేవల్లో కూడా ఇదే బలహీన ధోరణి నెలకొంది. విదేశాల్లో ఉద్యోగాలు చూసే భారతీయులు దేశానికి డాలర్ల పంపకంసహా వివిధ అంశాలకు సంబంధించిన ప్రైవేటు ట్రాన్స్‌ఫర్‌ రిసిట్స్‌ (ఆదాయాలు) త్రైమాసికంగా తగ్గుతున్నాయి.

2023 జనవరి–మార్చి మధ్య ఇలా దేశానికి వచి్చన మొత్తాల విలువ 28.6 బిలియన్‌ డాలర్లయితే, ఏప్రిల్‌–జూన్‌ మధ్య 27.1 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. దేశ దిగుమతుల భారం మరోవైపు పెరుగుతుండడం గమనార్హం. క్రూడ్‌ ధరలు ఇటీవల పెరగడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. భారత్‌ వస్తు ఎగుమతులు 2023 ఆగస్టులో వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ఎగుమతులు ఆగస్టులో 26.5 బిలియన్‌ డాలర్ల (2022 ఆగస్టు) నుంచి స్వల్పంగా 26.39 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

2023–24లో 2.1 శాతానికి అప్‌!
ఈ నేపథ్యంలో 2023–24 జూలై–ఆగస్టు త్రైమాసికంలో (క్యూ2) క్యాడ్‌ జీడీపీలో 2.3 శాతం (విలువల్లో 19 నుంచి 21 బిలియన్‌ డాలర్లు) విలువకు చేరవచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అదితీ నయ్యర్‌ అంచనావేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ శాతం 2.1 శాతంగా (73 బిలియన్‌ డాలర్ల నుంచి 75 బిలియన్‌ డాలర్లు) ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. 2022–23లో క్యాడ్‌ జీడీపీలో 2 శాతం. విలువలోల 67 బిలియన్‌ డాలర్లు.  

విదేశీ రుణ భారం 629 బిలియన్‌ డాలర్లు
భారత్‌ విదేశీ రుణ భారం జూన్‌ ముగిసే నాటికి 629.1 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. మార్చితో ముగిసిన నెలతో (624.3 బిలియన్‌ డాలర్లు) పోలి్చచూస్తే ఈ విలువ 4.7 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అయితే రుణ భారం జీడీపీతో పోలి్చతే ఇదే కాలంలో 18.8 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గింది. గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక రుణం (ఏడాదిపైన మెచ్యూరిటీ) మార్చితో పోలి్చతే 9.6 బిలియన్‌ డాలర్లు పెరిగి 505.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

మరిన్ని వార్తలు