రోజంతా ఊగిసలాట.. చివరకు భారీ నష్టాలతో ముగింపు

19 Apr, 2022 15:49 IST|Sakshi

ముంబై: స్టాక్‌ వరుసగా రెండో రోజు భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ ఆ వెంటనే నష్టపోవడం మొదలెట్టింది. తిరిగి ఇన్వెస్టర్లు నమ్మకం చూపించడంతో లాభాల బాట పట్టాయి సూచీలు. అయితే తాజాగా విడుదల అవుతున్న త్రైమాసిక ఫలితాలు, పెరిగిన ద్రవ్యోల్బణం, మళ్లీ రాజుకున్న ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ వేడితో చివరకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా మార్కెట్‌ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 57,318 పా​యింట్లతో మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 57,464 పాయిం‍ట్లను టచ్‌ చేయగలిగింది. అయితే అంతర్జాతీయ పరిణాలు ప్రతికూలంగా మారడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి చివరకు 703 పాయిట్లు నష్టపోయి 56,463 పాయిం‍ట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 304 పాయింట్లు నష్టపోయి 16,869 పాయింట్ల దగ్గర ముగిసింది. 

ఈ రోజు ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ షేర్లు ఇన్వెస్టర్లకు ఆనందాన్ని పంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల పాలయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్‌ సుమారు రెండు వేల పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఆరు వందల పాయింట్లకు పైగా కోల్పోయింది.

మరిన్ని వార్తలు