వీకెండ్‌ హోమ్స్‌తో హాయ్‌!

7 May, 2022 12:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నుంచి క్రమంగా తేరుకుంటున్న పర్యాటక ప్రేమికులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకం, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సమయాన్ని గడిపే వీలున్న వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టి మళ్లించారు. టూరిజం డిమాండ్‌ కొంతకాలం పాటు వీకెండ్‌ హోమ్స్‌ పరిశ్రమకు మళ్లుతుందని నిర్వాణా రియాల్టీ సీఈఓ పుణీత్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆతిథ్య రంగం వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ఆధారంగా వీకెండ్‌ హోమ్స్‌ను డిజైన్‌ చేస్తోంది. 

చదవండి: 5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్‌లో తగ్గని రియల్టీ జోరు
 

మరిన్ని వార్తలు