7 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

2 Nov, 2021 08:04 IST|Sakshi

బీవైడీ నుంచి ఎలక్ట్రిక్‌ ఎంపీవీ ఈ6

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బీవైడీ ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలు.

ఈ మల్టీ పర్పస్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌లో 71.7 కిలోవాట్‌ అవర్‌ లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్లేడ్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్‌ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్‌ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి. వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్‌ మోటార్‌ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్‌ చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు