బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

14 Dec, 2021 15:33 IST|Sakshi

ధర రూ. 1.16 కోట్లు 

వచ్చే ఏప్రిల్‌ నుంచి డెలివరీ 

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఐఎక్స్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.16 కోట్లు. వచ్చే ఆరు నెలల్లో భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ప్రవేశపెట్టబోయే మూడు ఎలక్ట్రిక్‌ వాహనాల శ్రేణిలో ఇది మొదటిది. దీన్ని పూర్తి బిల్టప్‌ యూనిట్‌గా (సీబీయూ) దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.

డెలివరీ ఎప్పుడంటే
సరికొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ఆన్‌లైన్‌ ఆఫ్‌లైన్‌ పద్దతిలో విక్రయించాలని నిర్ణయించారు. డీలర్‌షిప్‌లతో పాటు షాప్‌డాట్‌బీఎండబ్ల్యూడాట్‌ఇన్‌ ద్వారా వీటిని బుక్‌ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ పేర్కొంది. 2022 ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. ప్రారంభ ఆఫర్‌ కింద కాంప్లిమెంటరీగా స్మార్ట్‌ బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్‌ చార్జర్‌ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 11కేడబ్ల్యూ ఏసీ చార్జరుతో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్‌ చేయవచ్చని, 2.5 గంటల్లో 100 కి.మీ.కు సరిపడేంత చార్జింగ్‌ వీలవుతుందని విక్రమ్‌ వివరించారు.
 

చదవండి: బీఎండబ్ల్యూ దండయాత్ర.. 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు!

>
మరిన్ని వార్తలు