జియో కొత్త స్మార్ట్ గ్లాస్.. కళ్ల ముందే సరికొత్త ప్రపంచం!

5 Nov, 2023 17:38 IST|Sakshi

రిలయన్స్ సంస్థ టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిమీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, గేమింగ్ కంట్రోలర్స్ వంటివి ఆవిష్కరించింది. కాగా ఇటీవల ఓ సరికొత్త స్మార్ట్ గ్లాస్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్‌లో కనిపించిన ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ మెటాలిక్ ఫ్రేమ్‌తో రెండు లెన్స్‌లు పొందుతుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వైర్‌లెస్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి జియో గ్లాస్‌ను కంట్రోల్ చేయవచ్చు.

కేవలం 75 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్ గ్లాస్ 100 ఇంచెస్ వర్చువల్ డిస్‌ప్లేగా.. కళ్ళముందే గాలిలో తేలియాడే స్క్రీన్‌ను సృష్టిస్తుంది. బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేయడానికి ట్రాక్‌ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో లభిస్తాయి. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్ ఇందులో ఉండటం వల్ల వాయిస్ కాల్‌లకు రిసీవ్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో

4000mAh బ్యాటరీ కలిగిన ఈ జియో సన్ గ్లాస్‌ ఒక ఫుల్ ఛార్జ్‌తో మూడుగంటలు పనిచేస్తుంది. రెండు వెర్షన్లలో లభించనున్న ఈ సన్ గ్లాస్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు కూడా అప్పుడే వెల్లడవుతాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు