అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం

24 Nov, 2023 04:51 IST|Sakshi

చిన్న సంస్థలకు ఎగుమతులపై శిక్షణ  

న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్‌ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్‌ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది.

ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్‌టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్‌ వంటి వివిధ ఈ–కామర్స్‌ సంస్థలతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) చర్చలు జరుపుతున్నట్లు  వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి.

2030 నాటికి ఈ–కామర్స్‌ ద్వారా 350 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీíÙయేటివ్‌ (జీటీఆర్‌ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్‌ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్‌ ఎగుమతులను 20 బిలియన్‌ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ భూపేన్‌ వాకంకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు