సెల్ఫ్‌మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ 2023 లిస్ట్‌ విడుదల.. ఆయనే టాప్‌..

30 Nov, 2023 18:39 IST|Sakshi

ధనవంతులుగా ఎదగాలంటే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండాలనేది ఒకప్పటి విధానం. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉండి దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి వారి మన్ననలు పొందితే అదే డబ్బు సంపాదిస్తోందని చాలా మంది నిరూపిస్తున్నారు. తామకు తాము ఎలాంటి ‘గాడ్‌ఫాదర్‌’ లేకుండా కుబేరులుగా ఎదుగుతున్నారు. తాజాగా దేశంలో ధనవంతులైన ‘సెల్ఫ్‌మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌’ లిస్ట్‌ విడుదలైంది. అందులో డీమార్ట్‌ అధినేత రాధాకిషన్ దమానీ అగ్రస్థానంలో నిలిచారు. పేటీఎం, బొమాటో, క్రెడ్‌, జెరోధా, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌, రాజొర్‌పే వంటి స్టార్ట్అప్‌లు స్థాపించిన యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ సంస్థ ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2023' లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో డీమార్ట్‌ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌తో కలిసి రూ.2,38,188 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దమానీ మొదటిస్థానంలో నిలిచారు. ఫ్లిప్‌కార్ట్‌(రూ.1,19,472 కోట్లు)కు చెందిన బిన్నీ-సచిన్ బన్సాల్‌, జొమాటో(రూ.86,835 కోట్లు) దీపిందర్ గోయల్, డ్రీమ్ 11(రూ. 66,542 కోట్లు)కు చెందిన భవిత్ షేత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు.

రోజర్‌పే వ్యవస్థాపకులు హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌-అభయ్ సోయి, పేటీఎం-విజయ్ శేఖర్ శర్మ, క్రెడ్‌-కునాల్ షా, జెరోధా-నితిన్ కామత్ & నిఖిల్ కామత్‌లు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఈ లిస్ట్‌లో వయసు పైబడినవారిలో వరుసగా అశోక్ సూత(80)-హ్యాపీయెస్ట్ మైండ్స్‌, నరేష్ ట్రెహాన్-మెదంటా(77), అశ్విన్ దేశాయ్ (72)-ఏథర్స్, జైతీర్థరావు (71)-హోమ్‌ఫస్ట్‌ ఉన్నారు.

ఇదీ చదవండి: ‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్‌ కామెంట్స్‌

మరోవైపు ధనవంతుల జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగినవారిలో జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా(21), భారత్‌పే-నక్రానీ (25), జు పీ-దిల్‌షేర్ మల్హి(27), సిద్ధాంత్ సౌరభ్(28), ఓయో-రితేష్ అగర్వాల్(29) ఉన్నారు. ఈ జాబితాలో చోటుసాధించిన మహిళల్లో అతి పిన్న వయస్కుల జాబితాలో మామఎర్త్‌కు చెందిన గజల్ అలఘ్ (35), విన్జో-సౌమ్య సింగ్ రాథోడ్ (36), ప్రిస్టిన్ కేర్‌-గరిమా సాహ్నీ(37) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు