EPFO Provident Fund Scam: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట

27 Oct, 2023 15:48 IST|Sakshi

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇందులో బాధితులు ఏకంగా రూ. 4.32 కోట్లు మోసపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ముంబైకి చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఓ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అతని భార్యకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి.. ఆమె భర్తకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించి, మీ భర్త పీఎఫ్ ఖాతాలో 20 సంవత్సరాలకు కంపెనీ రూ. 4 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపింది.

కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బు ఇప్పుడు రూ. 11 కోట్లుకు మెచ్యూర్ అయిందని, ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి టీడీఎస్, జీఎస్‌టీ, ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాల్సి  ఉంటుందని తెలిపాడు. కాలర్ చెప్పినట్లుగా వృద్ద మహిళ పలుమార్లు రూ. 4.32 కోట్లు వారి ఖాతలో జమచేసింది.

ఇదీ చదవండి: రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్

ఎన్ని రోజులకు డబ్బు రాకపోవడం మాత్రమే కాకుండా.. ఇంకా డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడం, ఐటీ శాఖకు సమాచారం అందిస్తామని బెదిరించడం కూడా స్టార్ట్ చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఈ వృద్ధ జంట జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..

నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎక్కువ డబ్బు వస్తుందని అత్యాశ చూపితే ఎవరూ మోసపోవద్దని, బ్యాంకులకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు