మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్

25 Oct, 2021 15:53 IST|Sakshi

రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్/స్కూటర్ మార్కెట్లోకి వస్తుంది. తాజాగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసేందుకు సిద్దం అయ్యింది. ఎనిగ్మా(ENIGMA) అనే కంపెనీ 'కేఫ్ రేసర్' పేరుతో ఎలక్ట్రిక్ బైక్ తీసుకొనివచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ బైక్ ప్రీ బుకింగ్స్ నేటి నుంచి కంపెనీ డీలర్ షిప్స్, కంపెనీ వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. దీపావళికి ముందే ఈ మోటార్ సైకిల్ లాంఛ్ కానున్నట్లు అందరూ భావిస్తున్నారు. 

మేడ్ ఇన్ హైదరాబాద్
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ లలో ఒకటైన ఎనిగ్మా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ - 'కేఫ్ రేసర్'ను భారతదేశంలో లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోటార్ సైకిల్ ఐదు రంగుల్లో లాంఛ్ చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను భారతదేశంలో డిజైన్ చేసి తయారు చేస్తున్నారు. ఈ కేఫ్ రేసర్ 72V 50 Ah LifePo4(లిథియం ఫెర్రో ఫాస్ఫేట్) బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. సిటీ మోడ్ లో ప్రయాణిస్తే సింగిల్ చార్జ్ లో సుమారు 140 కిలోమీటర్ల మైలేజీ వరకు ప్రయాణిస్తుంది.(చదవండి: టెస్లా కార్లలో కలకలం..!)

దీని టాప్ స్పీడ్ గంటకు 136 కిలోమీటర్లు.  దీని హబ్ మోటార్ 5.6 కెడబ్ల్యు గరిష్ట పవర్ అందిస్తుంది. 0-80 శాతం 3 గంటల్లో ఛార్జ్ అయితే, ఫుల్ ఛార్జ్ 4 గంటలలో చార్జ్ అవుతుంది. ఈ బైక్ బ్యాటరీ 5 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. వీటిని భోపాల్, మండిదీప్, హైదరాబాద్(ఉప్పల్) కంపెనీ యూనిట్లో తయారు చేస్తున్నారు. ఈ మోటార్ సైకిళ్లను పాన్ ఇండియా లెవల్లో లాంఛ్ చేయాలిని చూస్తుంది. అలాగే లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ విషయంపై కూడా పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు