ఈ కామర్స్‌లో కొలువుల పండుగ

5 Sep, 2023 04:21 IST|Sakshi

దక్షిణాదిన 4,00,000 నియామకాలు

హైదరాబాద్‌లో 30 శాతం

టీమ్‌లీజ్‌ సరీ్వసెస్‌ వెల్లడి

హైదరాబాద్‌: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్‌ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్‌ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్‌ సంస్థలు నెట్‌వర్క్‌ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి.

ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్‌ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్‌ సరీ్వసెస్‌ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది.

పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్‌–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్‌ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్‌ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్‌ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది.

‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్‌ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్‌ సరీ్వసెస్‌ బిజినెస్‌ హెడ్‌ బాలసుబ్రమణియన్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్‌ ఉద్యోగాలు
రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్‌) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు, సార్టేషన్‌ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

‘‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ (డిస్కౌంట్‌ సేల్‌) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ బద్రి తెలిపారు. బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్‌మెంట్‌లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు