ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫ‌ర్‌: మీ పాత ఫోన్ అమ్మండి..కొత్త ఫోన్ కొనుగోలు చేయండి!!

14 Feb, 2022 19:11 IST|Sakshi

దేశీయ ఇ-కామర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు సువార్ణావ‌కాశం క‌ల్పించింది. సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్‌ను కొనుగోలు లేదా ఇత‌ర కొత్త ప్రొడ‌క్ట్‌ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తుంది. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది. 

ఇటీవ‌ల ఫ్లిప్‌కార్ట్ యంత్ర అనే రీకామ‌ర్స్ సంస్థను కొనుగోలు చేసింది.ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆ సంస్థ సాయంతో యూజ‌ర్ల‌నుంచి పాత ఫోన్‌ల‌ను క‌లెక్ట్ చేస్తుంది. ఇందులో యూజ‌ర్లు చేయాల్సింద‌ల్లా ఒక్కటే పాత ఫోన్ అమ్మాల‌నుకుంటే యంత్ర వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ల‌కు సంబంధించిన ప‌లు ప్ర‌శ్న‌లు స‌మాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స‌మాధానాల అనంత‌రం 48గంట‌ల్లో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వ‌చ్చి ఫోన్‌ను క‌లెక్ట్ చేసుకుంటారు. ఫోన్‌ను ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న త‌ర్వాత క‌స్ట‌మ‌ర్‌కు ఫ్లిప్‌కార్ట్ ఈవోచ‌ర్‌ను పంపిస్తుంది. ఆ ఈవోచ‌ర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్ తీసుకోవ‌చ్చు. లేదా ఇత‌ర ప్రొడ‌క్ట్స్ ఏవైనా కొనుగోలు చేయొచ్చు.

దేశ‌వ్యాప్తంగా 1700 పిన్‌కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయ‌నుంది. ప్ర‌స్తుతానికి స్మార్ట్‌ఫోన్ల‌ను ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అయినా స‌రే.. దేశంలో ఎక్క‌డున్నా స‌రే.. త‌మ ఫోన్‌ను అమ్ముకునే చాన్స్‌ను ఫ్లిప్‌కార్ట్ లో అమ్మే అవకాశం క‌ల్పిస్తుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా క‌స్ట‌మ‌ర్లు అమ్ముకునే సౌక‌ర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ క‌ల్పించ‌నుంది.

మరిన్ని వార్తలు