దేశంలో తొలి మోడల్‌.. ఫోర్స్‌ మోటార్స్‌ అర్బేనియా వస్తోంది

22 Nov, 2022 09:18 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్స్‌ మోటార్స్‌ తయారీ అర్బేనియా కొద్ది రోజుల్లో రోడ్డెక్కనుంది. యాత్రలు, కార్యాలయ సిబ్బంది ప్రయాణానికి ఇది ఉపయుక్తం. మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌నుబట్టి డ్రైవర్‌తోసహా 18 మంది కూర్చునే వీలుంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది.

115 హెచ్‌పీ, 350 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌తో మెర్సిడెస్‌ ఎఫ్‌ఎం 2.6 సీఆర్‌ ఈడీ టీసీఐసీ డీజిల్‌ ఇంజన్‌ పొందుపరిచారు. ఈ సెగ్మెంట్లో దేశంలో డ్యూయల్‌ ఎయిర్‌­బ్యాగ్స్, రోల్‌ఓవర్‌ ప్రొటెక్షన్‌తో తయారైన తొలి మోడల్‌ ఇదే. మోనోకాక్‌ స్ట్రక్చర్, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్, కొలాప్సిబుల్‌ స్టీరింగ్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, సీల్డ్‌ పనోరమిక్‌ విండోస్, 17.8 సెంటీమీటర్ల ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్‌ వంటి హంగులు ఉన్నాయి. 15 రోజుల్లో డీలర్‌షిప్‌లకు అర్బేనియా వాహనాలు చేరనున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. రూ.1,000 కోట్లతో అర్బేనియా వాహనాల అభివృద్ధి, తయారీ ప్రాజెక్టును ఫో­ర్స్‌ మోటార్స్‌ చేపట్టింది. 

మరిన్ని వార్తలు