ఐఎఫ్‌ఎస్‌సీ–గిఫ్ట్‌ సిటీ బ్యాంక్‌లో అకౌంట్‌ ప్రారంభం ఈజీ

12 Oct, 2023 06:16 IST|Sakshi

పాన్‌ లేకున్నా... విదేశీ కంపెనీలకు ఖాతా ప్రారంభ వెసులుబాటు

ఎన్‌ఆర్‌ఐ, నాన్‌–రెసిడెంట్లకూ ఇదే విధానం వర్తింపు  

న్యూఢిల్లీ: గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌–సిటీ... ఇంటర్నేషన్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సెంటర్స్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ–గిఫ్ట్‌ సిటీ) బ్యాంకులో ఎటువంటి పాన్‌ లేకుండా విదేశీ కంపెనీలు, ఎన్‌ఆర్‌ఐలు, నాన్‌–రెసిడెంట్లు అకౌంట్‌ ప్రారంభించే వెసులుబాటును ఆర్థికశాఖ కలి్పంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల మినహాయింపు కలి్పంచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనిప్రకారం  బ్యాంక్‌ ఖాతాను తెరిచే నాన్‌–రెసిడెంట్‌ లేదా విదేశీ కంపెనీ ఫారమ్‌ 60లో డిక్లరేషన్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది.

అలాగే  భారతదేశంలో ఎలాంటి పన్ను బకాయిలను కలిగి ఉండకూడదు. జీఐఎఫ్‌టీ–ఐఎఫ్‌ఎస్‌సీ ఆర్థిక రంగానికి సంబంధించి పన్ను–తటస్థ ప్రాంతంగా ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు విదేశీ కంపెనీలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర నాన్‌–రెసిడెంట్‌లు ఐఎఫ్‌ఎస్‌సీ బ్యాంక్‌లో బ్యాంక్‌ ఖాతాను తెరవడాన్ని సులభతరం చేస్తుందని నంగియా అండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ భాగస్వామి ( ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) సునీల్‌ గిద్వానీ అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్లుసహా ఐఎఫ్‌ఎస్‌సీలో రిటైల్‌ వ్యాపార విభాగం పురోగతికి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని గిద్వానీ చెప్పారు.

మరిన్ని వార్తలు