నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి

11 Nov, 2023 04:21 IST|Sakshi

సెపె్టంబర్‌లో ఐఐపీ 5.8%కి పరిమితం

న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్‌లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్‌లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్‌ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం..

► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది.
► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్‌లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది.
► మైనింగ్‌ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్‌లో మైనస్‌ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్‌లో 11.5 శాతం పెరిగింది.
► క్యాపిటల్‌ గూడ్స్‌ సెగ్మెంట్‌ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్‌లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ వృద్ధి గత సెపె్టంబర్‌లో మైనస్‌ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్‌ గూడ్స్‌ ఉత్పత్తి మైనస్‌ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది.  
► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్‌లో ఇది 8.2 శాతం.

మరిన్ని వార్తలు