Vivo Money Laundering Case: వివో ఇండియాకు భారీ షాక్‌!

24 Dec, 2023 09:34 IST|Sakshi

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివోకు భారీ షాక్‌ తగిలింది. వివో అనుబంధ వివో ఇండియా కు చెందిన మరో ముగ్గురు అధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

గతేడాది వివో ఇండియా వ్యాపారా లావాదేవీలపై ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల ద్వారా రూ.62,476 కోట్ల మేరకు చైనాకు వివో ఇండియా అక్రమంగా తరలించిందని ఈడీ అభియోగం మోపింది. అదే ఏడాది జూలైలో వివో ఇండియా కార్యాలయాలు, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివో ఇండియాతోపాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవలే పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.

ఇంతకుముందు హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి హోం రాయ్, చైనీయుడు గౌంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరు నలుగురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు