ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత

24 Dec, 2022 06:12 IST|Sakshi

ఆర్థికమంత్రిత్వశాఖ సర్వే నివేదిక  

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది.  అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్‌ నెలవారీ నివేదిక హెచ్చరించింది. 

అయితే కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస)  కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్‌ అకౌంట్‌ లోటు 100 బిలియన్‌ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది.

మరిన్ని వార్తలు