యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..

26 Oct, 2023 18:28 IST|Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలనే విషయాలను వెల్లడించారు.

గత రెండు మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.

ఇదీ చదవండి: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?

ప్రభుత్వంలో అవినీతి కూడా తగ్గించాలని, పని గంటలు పెంచాలని ఆలా జరగకపోతే పురోగతి సాధించిన దేశాలతో పోటీ భారత్ పోటీ పడటం సాధ్యం కాదని అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు