నూతన ఆవిష్కరణలకు వేదికగా గ్లోబల్‌ టెక్‌ సమిట్‌

14 Jan, 2023 06:11 IST|Sakshi

డీఎస్‌టీ హెడ్‌ అనితా అగర్వాల్‌ వెల్లడి

హైదరాబాద్‌: వచ్చే నెల ఫిబ్రవరిలో వైజాగ్‌లో జరగబోయే గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ 2023 .. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవగలదని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ (టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ట్రాన్స్‌ఫర్‌) అనితా అగర్వాల్‌ చెప్పారు. ఐటీ, సైన్స్, టెక్నాలజీ, స్టార్టప్స్, వాణిజ్యం తదితర రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మేధావులందరిని ఒక చోటికి చేర్చి, అర్థవంతమైన చర్చలకు తోడ్పడగలదని  ఆమె తెలిపారు. 25 మంది ఇన్నోవేటర్ల ప్రతినిధి బృందంతో శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

అంకుర సంస్థలు, శాస్త్రవేత్తలు తదితరులు తమ మేథోశక్తిని ప్రదర్శించేందుకు గ్లోబల్‌ టెక్‌ సమిట్‌ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించబోయే సదస్సులో పలు కీలక ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు గ్లోబల్‌ టెక్‌ సమిట్‌ 2023 లీడ్‌ ఆర్గనైజర్, పల్సస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఐఐటీ, సీఎస్‌ఐఆర్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 20 మంది ఆవిష్కర్తల బృందం వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు సందర్భంగా దాదాపు రూ. 3,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కుదిరే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు