Gold And Silver Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

14 Dec, 2023 14:50 IST|Sakshi

భారతీయ మార్కెట్లో గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5765, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6289గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 57650, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62890గా ఉంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1000 నుంచి రూ. 1090 వరకు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి.

నిన్న చెన్నైలో రూ. 5700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు రూ. 5820కి చేరాయి. అంటే ఒక గ్రామ్ బంగారం ధర ఈ రోజు రూ. 1200 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 6349కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 1310 వరకు పెరిగింది.

ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?

ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5780, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6304గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 1000, రూ. 1090 పెరిగింది. కొత్త ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 5780 (22 క్యారెట్స్), రూ. 63040కి (24 క్యారెట్స్) చేరింది.

వెండి ధరలు
మార్కెట్లో కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్నతో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు రూ. 2500 ఎక్కువ కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు