Pooja Hegde : చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదరింపులు.. నిజమెంత?

14 Dec, 2023 13:48 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ తప్పుడు వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూజా హెగ్డే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల దుబాయ్‌ వెళ్లారని.. అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుట్ట బొమ్మ ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. ఏం జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

తాజాగా ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్‌ స్పందించింది. ‘అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు’అని ఆమె టీమ్‌ పేర్కొంది. అలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తలను కూడా డిలీట్‌ చేయించింది. దీంతో ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక పూజా హెగ్డే సినిమాల విషయాలకొస్తే.. తెలుగులో ‘అల..వైకుంఠపురములో’ తర్వాత పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కవ వరుస అవకాశాలు​ వస్తున్న సమయంలోనే బాలీవుడ్‌కి జంప్‌ అయింది. అక్కడ చివరిగా సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా బాయ్‌ కిసీకి జాన్‌’సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

షాదీ కపూర్‌ హీరోగా నటిస్తున్న దేవా చిత్రంలో హీరోయిన్‌గా పూజాని సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణ ప‌నులు ప్రారంభమయ్యాయి.  2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరుకారం’ చిత్రంలో తొలుత పూజానే హీరోయిన్‌. షూటింగ్‌ వాయిదా పడడంతో డేట్స్‌ కుదరక ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం తెలుగులో పూజాకు ఎలాంటి ప్రాజెక్ట్స్‌ లేవు. 

>
మరిన్ని వార్తలు