అవతార్‌ ఫ్రాంచైజీలో మొత్తం ఎన్నో తెలుసా.. 2031లో చివరి భాగం

14 Dec, 2023 16:08 IST|Sakshi

జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్‌’. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ సునామీని క్రియేట్‌ చేసింది. రూ.1200 కోట్ల బడ్జెట్‌తో క్రియేట్‌ అయిన ఈ విజువల్‌ వండర్‌కు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 24 వేల కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇదే ఇప్పటి వరకూ నమోదైన భారీ రికార్డ్‌. ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన మరో సినిమా ఏదీ లేదు. దీంతో  ‘అవతార్‌ 2’పై భారీ అంచనాలతో 2022లో విడుదలైంది. పండోరా లోకం నుంచి సీక్వెల్‌గా ‘అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌’గా పార్ట్‌-2 వచ్చిన విషయం తెలిసిందే..

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచంలో   రానున్న మూడో భాగాన్ని 2025లో విడుదల చేస్తామని ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. మూడో భాగంలో విజువల్‌ వండర్స్‌తో పాటు పాత్రలపై కూడా ఎక్కువగా దృష్టి  పెడుతున్నట్లు చెప్పాడు. మంచి స్టోరీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను మరింతి అలరించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడు. 2025 డిసెంబర్‌ 19న అవతార్‌ పార్ట్‌ -3 విడుదల అవుతుందని ఆయన మరోసారి ప్రకటించడం విశేషం.

2024లో అందరినీ మెచ్చేలా ఎక్కువ రన్‌టైమ్‌లో టీజర్‌ ఉంటుందని తెలిపాడు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఇందులో యాక్షన్ సీన్స్‌ ఉంటాయని తెలిపాడు. గతంలో వచ్చిన రెండు భాగాల మాదిరే ఇందులో  కూడా భిన్నమైన కథనంతో పాటు విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయన్నాడు. 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' లో కనిపించిన కేట్‌ విన్స్‌లెట్‌ చేసిన రోనాల్‌ పాత్రను అవతార్‌ 3లో కూడా ఉంటుంది. దీని కోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నాడు.

'అగ్ని' ప్రధానంగా మూడో భాగం సాగుతుందని ఆయన తెలుపుతూ .. అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని తెలిపాడు. ఫ్రాంచైజీలో 'అవతార్‌- 4' 2029లో విడుదల అవుతుందని, చివరిగా రానున్న 'అవతార్‌- 5' కూడా  2031లో విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు