టాటా పవర్, ఐఓసీఎల్ ఒప్పందం.. 500 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నెల్

12 Dec, 2023 10:48 IST|Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్​, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్‌‌‌‌లను ఇన్‌‌‌‌స్టాల్ చేయనున్నాయి.

త్వరలో ఇన్‌‌‌‌స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లలో ప్రారంభించనున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్‌‌‌‌ బిజినెస్ డెవలప్‌‌‌‌మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు.

ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?

ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు