Gold Price: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త!

17 Sep, 2021 19:21 IST|Sakshi

మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం గత రెండు రోజుల్లోనే బంగారం ధరలు రూ.1,000కి పైగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.500లు తగ్గడంతో రూ.46,333కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.42,905 నుంచి రూ.42, 441కు తగ్గింది.(చదవండి: వంట నూనెల ధరలు తగ్గుముఖం... అయినా తప్పని భారం!)

మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.469లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ61,063కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.62,532లుగా ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.48,000ల నుంచి రూ.47,350కు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.

మరిన్ని వార్తలు