Today Gold And Silver Prices: పండుగ వేళ ఊరిస్తున్న పసిడి! వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు

8 Nov, 2023 11:35 IST|Sakshi

Gold rate today: పండుగ వేళ కొనుగోలుదారులను పసిడి ఊరిస్తోంది. దేశమంతటా దీపావళి పండుగ సంబరం నెలకొంది. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి పుత్తడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి. ఇవాళ (నవంబర్‌ 8) వరుసగా ఐదో రోజు బంగారం ధరలు దిగివచ్చాయి.

ఈ రోజు (నవంబర్‌ 8) హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా ఐదో రోజు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 150 తగ్గింది. 24 క్యారట్ల పసిడి ధర రూ.160 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.61,200 ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,200.
  • ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,350.
  • కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,200.
  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,200.

వెండి కూడా తగ్గుముఖం
Today Silver Price: దేశవ్యాప్తంగా ఈరోజు (నవంబర్‌ 8) వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండిపై రూ.1000 తగ్గింది. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 73.50 గాను, కేజీ వెండి రూ.73,500 గానూ ఉంది. ఇక హైదరాబాద్‌లో ఈరోజు వెండి ధర కేజీకి రూ.76,500 ఉంది.

మరిన్ని వార్తలు