Today Gold And Silver Prices: షాకిచ్చిన బంగారం! భారీగా పెరిగిన ధరలు.. ఇక కొన్నట్టే..!

14 Oct, 2023 17:28 IST|Sakshi

Gold rate today: దేశంలో ఈరోజు (అక్టోబర్‌ 14) బంగారం ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన రక్షణగా, ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని చూస్తున్న నేపథ్యంలో దేశంలో పసిడికి అత్యంత డిమాండ్‌ ఉంటోంది. 

దేశంలోని ప్రసిద్ధ జువెలర్స్‌ అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1400, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1530 పెరిగింది. 

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ. 55,400లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1530 పెరిగి రూ.60,440 లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు రూ. 54,000, రూ.58,910 లుగా ఉండేవి.

ఎగిసిన వెండి  
Silver price today: దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ఈరోజు (అక్టోబర్‌ 14) ఈరోజు ఏకంగా రూ.1500 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.77,000 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

మరిన్ని వార్తలు