పసిడి ధరల్లో ఒడిదుడుకులు

27 Aug, 2020 18:01 IST|Sakshi

షేర్‌మార్కెట్‌ వైపు ఇన్వెస్టర్ల చూపు

ముంబై : బంగారం, వెండి ధరల క్షీణత కొనసాగుతోంది. గత వారం రోజుల్లో ఆరు రోజుల  పాటు బంగారం ధరలు పతనాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో గురువారం పదిగ్రాముల బంగారం 435 రూపాయలు తగ్గి 51,344కు దిగివచ్చింది. ఇక 884 రూపాయలు తగ్గిన కిలో వెండి 66,645 రూపాయలకు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో మదుపుదారుల నుంచి బంగారానికి డిమాండ్‌ పలుచబడిందని ట్రేడర్లు, బులియన్‌ నిపుణులు అంచనా వేశారు. ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు వెలువడేవరకూ బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ధరలు మరింత తగ్గితే కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని కొటాక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది.

మరిన్ని వార్తలు