దేశంలో బంగారం ధరలు..రూ.60 వేల మార్కును దాటేసింది..

21 Mar, 2023 18:56 IST|Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్‌ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. తాజాగా మంగళవారం రోజు బంగారం ధర మరింత పెరిగింది. 

మార్చి 21న దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,285 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 ఉండగా 24 క‍్యారెట్ల బంగారం ధర 60,150 గా ఉంది. 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60వేలకు చేరింది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేలకు చేరింది. 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలకు చేరింది

వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేలకు చేరింది. 

చదవండి👉 కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు!

మరిన్ని వార్తలు