-

ఐఫోన్‌-13ను ఎగతాళి చేసిన గూగుల్‌ నెక్సస్‌..!

16 Sep, 2021 22:17 IST|Sakshi

ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లను ఆపిల్‌ మంగళవారం రోజున లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లపై కొంతమంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేశారు. నెటిజన్స్‌తో పాటుగా జోమాటోకూడా ఐఫోన్‌-13 డిజైన్‌పై  ట్రోల్‌ చేసింది. తాజాగా ప్రముఖ దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌ కూడా ఐఫోన్‌-13 దారుణంగా ట్రోల్‌ చేసింది.
చదవండి: ఐఫోన్‌- 13 రిలీజ్‌..! విపరీతంగా ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..

గూగుల్‌ తన సొంత ట్విటర్ ఖాతా నుంచి కాకుండా గతంలో గూగుల్‌ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్‌ గూగుల్‌ నెక్సస్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ‘నేను గూగుల్‌ పిక్సెల్‌6 వచ్చేదాకా నిరీక్షిస్తానని’ తన ట్విట్‌లో పేర్కొందని 9టూ5గూగుల్‌ పేర్కొంది. ఇక్కడ విషయమేమిటంటే గూగుల్‌ నెక్సస్‌ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసింది. గూగుల్‌ త్వరలోనే పిక్సెల్‌ 6 శ్రేణి ఫోన్లను లాంచ్‌ చేయనుంది.  

ఫోటో కర్టసీ: 9టూ5గూగుల్‌.కామ్‌

ఐఫోన్‌-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్‌లను ఆపిల్‌ రిలీజ్‌ చేసింది. ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లను సెప్టెంబర్‌-17 నుంచి ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చునని ఆపిల్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 24 నుంచి ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12తో ఐఫోన్‌-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్‌లతో సహా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉందని ఆపిల్‌ తన లాంచ్‌ ఈవెంట్‌ పేర్కొంది. 

చదవండి: బ్యాంక్‌, ఆధార్‌ వివరాలపై గూగుల్‌ పే యాక్సెస్‌.. యూజర్ల భద్రతకు ముప్పు!

మరిన్ని వార్తలు