హెచ్‌ఆర్‌ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం..

11 May, 2022 14:56 IST|Sakshi

ఓ స్థాయికి చేరుకున్న ఈ సంస్థలో అయినా యాజమాన్యం, ఉద్యోగులకు వారధిగా పని చేసేది హ్యుమన్‌ రిసోర్స్‌ (హెచ్‌ఆర్‌) డిపార్ట్‌మెంట్‌. ఎంతో శ్రమించి పని చేసే ఈ డిపార్ట్‌మెంట్‌పై సోషల్‌ మీడియాలో నిత్యం జోకులు, మీమ్స్‌ వస్తూనే ఉంటాయి. తాజాగా హెచ్‌ఆర్‌ పని తీరు ఎలా ఉంటుంది. కార్పోరేట్‌ వరల్డ్‌లో వారి పాత్ర ఎలా ఉంటోందో ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌గోయెంకా సరదాగా ట్విటర్‌లో స్వామి హర్షానంద అవతారంలో వివరించారు.

స్వామి హర్షానంద అభిప్రాయం ప్రకారం కార్పోరేట్‌ ప్రపంచంలో హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ అనేక రకలైన పాత్రలను పోషిస్తుంది. ఇందులో ముఖ్యమైన వాటిలో అనధికారిక లాయర్‌, సైకియాట్రిస్ట్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్‌, టీచర్‌, సమస్యల పరిష్కార కర్త, కెరీర్‌ ప్లానర్‌, డిటెక్టివ్‌ వంటివి ఉన్నాయి. ఇన్ని పాత్రలు సమర్థంగా పోషించే అతను ఉద్యోగులకు జీతాలిచ్చేప్పుడు పినాసిగా మారిపోతాదంటూ చమత్కరించారు హర్ష్‌ గోయెంకా.

హర్ష్‌గోయెంకా ట్వీట్‌కు నెటిజన్లు కూడా సరదాగా రిప్లై ఇస్తున్నారు. కొందరు చాలా మంది స్వామి హర్షానంద అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా.. హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధులు మాత్రం.. ఉద్యోగులు తమనే టార్గెట్‌ చేస్తారని, కానీ జీతం పెంచడం తమ చేతిలో ఉండదని అది హెచ్‌వోడీల ఇష్టమని చెబుతున్నారు. ఎన్నో పనులు సమర్థంగా పని చేస్తున్నా.. నిందలు తమపైనే పడతాయంటున్నారు.

చదవండి: ష్‌.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు