భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్‌ టెక్‌.. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థతో..

30 Oct, 2023 18:34 IST|Sakshi

ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCL Tech) భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్‌ (Banco do Brasil) సేల్స్‌ఫోర్స్‌ ద్వారా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, కస్టమర్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌లను మెరుగుపరిచేందుకు హెసీఎల్‌ టెక్నాలజీస్‌ను ఎంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

సేల్స్‌ఫోర్స్‌తో భాగస్వామ్యం ద్వారా హెచ్‌సీఎల్‌ టెక్.. బ్యాంకో డో బ్రెజిల్ కస్టమర్ రిలేషన్స్, సర్వీస్ సొల్యూషన్‌లను మెరుగుపరచనుంది. తమ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వనరులు, డేటా ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి కస్టమర్ సంతృప్తి, ఎంగేజ్‌మెంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థ
లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్‌  దాని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, సేల్స్‌ఫోర్స్ అమలుకు హెచ్‌సీఎల్‌ టెక్‌ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకుంది. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..)

 

బ్యాంకో డో బ్రెజిల్‌  అవసరాలకు అనుగుణంగా సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్స్‌ను అమలు చేయడానికి హెసీఎల్‌ టెక్‌ కస్టమర్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌ అనుభవం ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే సంపూర్ణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నాలుగు సేల్స్‌ఫోర్స్ పరిష్కారాలను ఉపయోగించనుంది. అయితే ఈ భారీ ఒప్పందం విలువ ఎంత అనేది వెల్లడించలేదు.

ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి

మరిన్ని వార్తలు