-

వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త

4 Mar, 2021 09:46 IST|Sakshi

గృహ రుణ రేటు తగ్గింపు

6.75 శాతం నుంచీ రుణం లభ్యం

సాక్షి,ముంబై: భారత్‌ ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ రేటును బుధవారం ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. తాజా నిర్ణయం ప్రకారం  మంచి సిబిల్‌ స్కోర్‌ ఉన్న వారికి 6.75 శాతం నుంచి గృహ రుణం లభ్యమవుతుంది.  బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు తమ రుణ రేట్లను వరుసగా 6.70 శాతం, 6.65 శాతానికి తగ్గించిన రెండు రోజుల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తీసుకుంది. మార్చి 4వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. తాజా మార్పు హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత గృహ రుణగ్రహీతలకూ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అయితే తాజా రుణ రేటుకు మార్చుకోవాలనుకునే కస్టమర్లు సంస్థను సంప్రదించి, కొంత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. (‘గంగవరం’.. అదానీ పరం!)

రూ.5,000 కోట్ల సమీకరణ:  ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 5న ఇష్యూ ప్రారంభమై, అదేరోజు ముగుస్తుంది. (గుడ్‌ న్యూస్‌ : 1000 ఇంజీనీర్‌ ఉద్యోగాలు)

మరిన్ని వార్తలు