హీరో మోటోకార్ప్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. మేడ్ ఇన్ ఏపీ

14 Nov, 2021 21:37 IST|Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ వేహికల్ ప్రాజెక్ట్ ఇప్పటికే చివరి దశలో ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ప్లాంట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి లుక్ చూపింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీ బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ, మరిన్ని ఫీచర్లను టెక్ దిగ్గజంతో పంచుకోవడానికి తైవాన్ కంపెనీ గోగోరోతో ఒప్పందం చేసుకుంది. హీరో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంతకుముందు చూపించినట్లు మార్కెట్లోకి తీసుకొని రానున్నారు. ఇది ఫుల్-ఎల్ఈడీ లైటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ రేంజ్, బ్యాటరీ స్వాప్ టెక్నాలజీతో రాబోతుంది. హీరో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, అథర్ 450ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది. హీరో కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం తన ప్రత్యర్థుల కంటే తక్కువ ధరకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర లక్ష లోపు ఉండే అవకాశం ఉంది.

(చదవండి: ఎలన్‌ మస్క్‌ స్పేస్ ఎక్స్‌ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన ఇండో-అమెరికన్!)

మరిన్ని వార్తలు