ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌

19 Oct, 2021 06:04 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదై 55,907 యూనిట్లు విక్రయమయ్యాయి. 2021 ఏప్రిల్‌–జూన్‌తో పోలిస్తే క్రితం త్రైమాసికంలో మూడు రెట్లకుపైగా డిమాండ్‌ రావడం గమనార్హం. హౌసింగ్‌ బ్రోకరేజ్‌ కంపెనీ ప్రాప్‌టైగర్‌.కామ్‌ ప్రకారం.. 2020 జూలై–సెపె్టంబర్‌లో ఈ సంఖ్య 35,132 యూనిట్లుగా ఉంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇళ్లకు డిమాండ్‌ అధికమైంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఇళ్ల ధరలు అందుబాటులోకి రావడం, కోవిడ్‌ నేపథ్యంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకోవడం వంటివి ఈ డిమాండ్‌కు కారణం. మొత్తం అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు విలువ చేసే ఇళ్ల వాటా 40 శాతంగా ఉంది. రూ.45–75 లక్షల విలువ గలవి 28 శాతం వాటా దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలకుపైగా అధికమై 3,260 నుంచి 7,812 యూనిట్లకు చేరాయి.

మరిన్ని వార్తలు