భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు, కారణం అదేనా..!

20 Nov, 2021 07:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్యమైన కార్మికుల వ్యయం పెరిగిన నేపథ్యంలో దాని ప్రభావం రియల్టీ మార్కెట్‌లపై పడనుంది. సమీప భవిష్యత్తులో ప్రాపర్టీ ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని డెవలపర్ల సంఘాలు తెలిపాయి.


 
నిర్మాణ సామాగ్రిపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించి ఉపశమనాన్ని కలిగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీల ధరలు 10–20 శాతం పెరిగాయని ట్రెహాన్‌ డెవలపర్స్‌ ఎండీ సరన్‌షా ట్రెహాన్‌ తెలిపారు.

కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగినప్పటికీ.. డెవలపర్లు డిమాండ్‌ను కొనసాగించడం కోసం ప్రాపర్టీ ధరలను తక్కువ స్థాయిలోనే కొనసాగించారని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.

చదవండి: ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే

మరిన్ని వార్తలు