గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్

27 Dec, 2020 16:36 IST|Sakshi

న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. అలాగే మనకు ఆన్లైన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తో బుక్ చేయడం ద్వారా ఒక్కో సారి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు పేటీమ్ లో కూడా ఆఫర్ ఒకటి నడుస్తుంది. మీరు మీ గ్యాస్ సిలిండర్‌ను పేటీమ్ యాప్ లో బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.(చదవండి: మోటోరోలా నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్)

ఈ ఆఫర్‌ను పేటీమ్ యాప్‌లో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు పేటీమ్ లో మొదటి సారి బుక్ చేసుకున్న వినియోగదారులకు లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పేటీమ్ యాప్ లో "బుక్ ఏ సిలిండర్" క్లిక్ చేసి తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు, ఎల్‌పీజీ ఐడీ, కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ కింద FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించి మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ వర్తిస్తుంది.


 

మరిన్ని వార్తలు