శాంసంగ్‌ను దాటిన హువావే

31 Jul, 2020 06:37 IST|Sakshi

లండన్‌: స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాల్లో ప్రపంచ టాప్‌ సెల్లర్‌గా హువావే నిలిచినట్టు పరిశోధన సంస్థ కెనలిస్‌ వెల్లడించింది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) హువావే 5.58 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్టు కెనలిస్‌ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల. శాంసంగ్‌ విషయానికి వస్తే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు తగ్గి 5.37 కోట్ల యూనిట్లు నమోదైంది. హువావేకు కోవిడ్‌–19 కలిసి వచ్చిందని కెనలిస్‌ తెలిపింది. చైనాలో ఈ కంపెనీ అమ్మకాలు గడిచిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో చైనా వాటా 70 శాతముంది. చైనా రికవరీ హువావేకు కలిసి వచ్చింది. శాంసంగ్‌కు యూఎస్, యూరప్, బ్రెజిల్, భారత్‌ ప్రధాన మార్కెట్లు. చైనా నుంచి సమకూరుతుంది తక్కువే.

మరిన్ని వార్తలు