ఐసీఎస్‌ఐ కొత్త కార్యవర్గం

21 Jan, 2021 09:02 IST|Sakshi

హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌కు (తెలంగాణ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2021 సంవత్సరానికి గాను చైర్మన్‌గా హైదరాబాద్‌లోని ప్రాక్టీసింగ్‌ కంపెనీ సెక్రటరీ సీఎస్‌ నవజ్యోత్‌ పుట్టపర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా సీఎస్‌ సుధీర్‌ కుమార్‌ పోలా, సెక్రటరీగా సీఎస్‌ లలితాదేవి తంగిరాల, ట్రెజరర్‌గా సీఎస్‌ అక్షితా సురానా నియమితులయ్యారు. మేనేజింగ్‌ కమిటీ మెంబర్లుగా సీఎస్‌ పీ విక్రమ్‌ రెడ్డి, సీఎస్‌ రాధాకృష్ణ, సీఎస్‌ ఏ రాజా మోగ్లీలు ఉంటారు. సీఎస్‌ వీ ఆహ్లాదరావు, ఆర్‌ వెంకటరమణలు ఇతర సభ్యులుగా కొనసాగుతారు.

మరిన్ని వార్తలు